ఆ మూడు జ‌బ్బుల‌కు మందే లేదంటున్న సీఎం జ‌గ‌న్‌..!

-

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి కర్నూలు జిల్లాలో మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ అవ్వ, తాతలకు ఎంత చేసినా తక్కువే అని చెప్పే వారిలో మొదటి వ్యక్తిని తానేనని అన్నారు. వృద్ధుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పేదవాడికి వైద్యం అందించడానికి డాక్టర్ లేడు అన్న పదం రాకూడదని స్పష్టం చేశారు. అయితే ఈ క్ర‌మంలోనే సీఎం జగన్.. ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీలో కేన్సర్ కైనా ఉచితంగా వైద్యం చేయించే చికిత్స ఉంది.. కానీ.. అసూయతో పుట్టే కడుపు మంటకు మాత్రం ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదన్నారు.

కంటి చూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది..కానీ.. చెడు దృష్టికి మాత్రం ఎక్కడా చికిత్స లేనే లేదన్నారు. వయసు మళ్లితే చికిత్సలు ఉన్నాయి.. కానీ.. మెదడు కుళ్లితే మాత్రం.. చికిత్సలు లేనే లేవు అన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న మనుషులను.. మహానుభావులుగా చూపించే కొన్ని చానళ్లు, పత్రికలు ఉన్నాయన్న సీఎం జగన్.. వాళ్లను బాగు చేసే మందులు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. వీటన్నింటి మధ్య మీ బిడ్డగా మీకోసం పని చేస్తున్నా అని సీఎం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news