రాజన్న సుపరిపాలన సిద్ధించడమే ఇక నా సంకల్పం: ఫేస్ బుక్ లో వైఎస్ జగన్ పోస్ట్

-

ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ మాత్రం వైఎస్ జగన్‌కు మాంచి ఉత్సాహాన్ని ఇచ్చాయట. ఇక తాను సీఎంను అయిపోయానన్న హుషారులో ఉన్నారు జగన్. అందుకే.. సీఎం కాగానే ఏం చేయాలి.. ఏపీని ఎలా అభివృద్ధి చేయాలి.. అన్న ఆలోచనలో పడ్డారట.

నెల.. తర్వాత రోజులు.. ఇప్పుడు గంటలు.. అవును.. మరికొన్ని గంటల్లో ఏపీ భవితవ్యం తేలనుంది. వైసీపీనా లేక టీడీపీనా? ఎవరికి ఏపీ ప్రజలు పట్టం కట్టారు. ఎవరు గెలవబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైఎస్ జగన్‌కే ప్రజలు బ్రహ్మరథం పట్టారా? అనేది తెలియాలంటే రేపు మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే.

కానీ.. ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ మాత్రం వైఎస్ జగన్‌కు మాంచి ఉత్సాహాన్ని ఇచ్చాయట. ఇక తాను సీఎంను అయిపోయానన్న హుషారులో ఉన్నారు జగన్. అందుకే.. సీఎం కాగానే ఏం చేయాలి.. ఏపీని ఎలా అభివృద్ధి చేయాలి.. అన్న ఆలోచనలో పడ్డారట. ఈనేపథ్యంలో జగన్ చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఫేస్‌బుక్‌లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. అదే ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమైంది. ఇంకా ఎన్నికల ఫలితాలు కూడా రాకముందే వైఎస్ జగన్.. తానే సీఎం అని చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది ఆ పోస్ట్ చూస్తే.

ప్రజాస్వామ్యంలో ప్రజాపరిపాలనే సాగాలి.. మండుటెండల్ని సైతం లెక్కజేయకుండా క్యూలలో నిలబడి ప్రజలు ఓట్లేశారు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనాన్ని నిలబెట్టారు. వారి ఆశీస్సులు అందినవేళ వారికి బాధ్యుడినై ఉంటాను.. అంటూ తన ఫోటోపై పై వ్యాఖ్యలను జోడించి.. రాజన్న సుపరిపాలన సిద్ధించడమే ఇక నా సంకల్పం అంటూ క్యాప్సన్ పెట్టారు. దీనికి నెటిజన్లు కూడా బాగానే స్పందించారు. జై జగనన్న.. సీఎం జగన్.. కంగ్రాచ్యులేషన్స్ సీఎం సర్.. అంటూ నెటిజన్లు వైఎస్ జగన్‌కు అభినందనలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version