పులివెందుల జోలికొస్తే జగన్ ఎందుకు ఊరుకుంటాడు .. బెండు తీశాడు !

-

రాజకీయంగా వైయస్ కుటుంబాన్ని బాగా ఆదరించింది పులివెందుల నియోజకవర్గం. జగన్ జైల్లో ఉన్న టైంలో ప్రతిపక్షంలో ఉన్న టైంలో ఎక్కడా కూడా జగన్ మీద కొంచెం కూడా అభిమానం తగ్గించుకోకుండా పులివెందుల నియోజకవర్గ ప్రజలు బాగా ఆదరించారు. ఇటువంటి తరుణంలో పులివెందులలో వైయస్ కుటుంబాని గత దశాబ్దాల నుండి రాజకీయాలలో ఎదుర్కొంటున్న నేత సతీష్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు సతీష్ రెడ్డి చూసుకునేవారు.Security tightened at residences of Chandrababu, Jagan in ...ఇటువంటి నేపథ్యంలో సతీష్ రెడ్డి ని చంద్రబాబు అధికారంలో ఉన్న టైంలో సరిగ్గా పట్టించుకోకపోవడంతో పాటుగా సరైన ప్రాధాన్యత పార్టీలో ఇవ్వకపోవడంతో ఇటీవల టీడీపీకి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేయక ముందు సతీష్ రెడ్డి రాజకీయంగా రాయలసీమలో ఎదగాలంటే కచ్చితంగా వైయస్ ఫ్యామిలీ అండగా ఉండాలని ముందుగా వైయస్ జగన్ ని కలిసి అంతా సెటిల్ చేసుకుని త్వరలో వైసీపీ పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు. ఇటువంటి నేపథ్యంలో పులివెందల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి చంద్రబాబు బీటెక్ రవి ని రంగంలోకి దింపారు. అంతే కాకుండా పులివెందులలో పార్టీ కేడర్ ని మొత్తం బీటెక్ రవి కి అండగా ఉండాలని ముందుగా తన సహచరులతో పులివెందులలో ఉన్న కార్యకర్తలకు చెప్పించారు అట.

 

దీంతో పులివెందుల రాజకీయాల్లో బాగా చంద్రబాబు జోక్యం చేసుకోవటంతో తన దగ్గరికి వచ్చిన సతీష్ రెడ్డి ద్వారా ఎవరు కూడా బీటెక్ రవి అనే టిడిపి క్యాండెట్ కి నియోజకవర్గంలో ఏ మనిషి తోడుగా ఉండకూడదని సతీష్ రెడ్డి కి జగన్ ఆదేశాలు ఇచ్చారట. దీంతో పులివెందుల నియోజకవర్గంలో అడుగుపెట్టిన బీటెక్ రవి కి పార్టీ క్యాడర్ ఎవరూ సహకరించడం లేదని చెబుతున్నారు. కనీసం ఆయన వెంట నడిచే వారే లేరని చెబుతున్నారు. క్యాడర్ అంతా సతీష్ రెడ్డి వెంటనే వెళ్లిపోవడంతో బీటెక్ రవి దాదాపు ఒంటరిగానే అయిపోయాడు. దీంతో పులివెందుల రాజకీయ జోక్యం చేసుకోవాలని ప్లాన్ వేసిన చంద్రబాబుకి జగన్ తన ఎత్తుగడలతో బెండు తీసినట్టు అయ్యింది.  

Read more RELATED
Recommended to you

Latest news