జ‌గ‌న్ నిర్ణ‌యాలు అన్న‌దాత‌ల గుండె చ‌ప్పుడుకు అద్దం ప‌ట్ట‌వా…!

-

11 వేల రైతు భ‌రోసా కేంద్రాల ఏర్పాటు-నిర్ణ‌యంతో అన్నాదాత‌ల గుండెల్లో ర‌గులుతున్న ఆవేద‌నాగ్నిని ఆర్పేందుకు జ‌గ‌న్ చేస్తు న్న ప్ర‌య‌త్నాలకు స‌ర్వ‌త్రా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. అత్యంత కీల‌క‌మైన ఈ విష‌యం నేడు అసెంబ్లీలో చ‌ర్చకు వ‌చ్చింది. గ‌డిచిన కొన్ని ద‌శాబ్దాల కాలంలో ఏ ప్ర‌భుత్వ‌మూ చేయ‌ని విధంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న ఈ కీల‌క కార్య‌క్ర‌మం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇన్నాళ్లుగా ఉన్న అనేక క‌ష్టాలు తొలిగిపోయే అవ‌కాశం ఉంద‌ని మేధావులు, విశ్లేష‌కులు చెబుతున్నారు.

నిజానికి దేశంలో రై తుల‌కు సంబంధించి స్వామినాథ‌న్ క‌మిష‌న్ ఉత్త‌ర్వుల‌ను లేదా సిఫార‌సుల‌ను అమ‌లు చేయాల‌నే డిమాండ్ ఉంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రంలోనూ స్వామినాథ‌న్ క‌మిష‌న్ రిపోర్టును ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. కానీ, ఏపీలో తొలిసారి స్వామినాథ‌న్ సిఫార‌సుల‌కు మించిన విధంగా రైతు భ‌రోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య త్నాలు నిజంగా అన్న‌దాత‌ల గుండె చ‌ప్పుడుకు అద్దం ప‌ట్ట‌నున్నాయి. గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జగన్ తెలిపారు.

రాష్ట్రంలోని రైతుల సమస్యలను ఈ భరోసా కేంద్రాల్లోనే పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందరు. రాబోయే ఖరీఫ్‌ నాటికి 11, 158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయంలో నూతన విధానాలను ఆవిష్కరించేందుకు వర్క్‌షాపుల ఏర్పాటుకు త్వరలోనే శ్రీకారం చుడతామని చెప్పారు. దీని ద్వారా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా భూసార పరీక్షలు, ఈ క్రాఫ్‌పై అవగాహన కల్పించే విధంగా అధికారులు చర్య‌లు తీసుకుంటారు. అలాగే విత్తన పరీక్షలు కూడా చేసుకోవచ్చు. పంటలు వేయడానికి ముందే కనీస మద్దతు ధరలు ప్రకటిస్తారు. రైతు భరోసాను రూ.12500 నుంచి 13500కు పెంచి.. దీనిని అమ‌లు చేసే బాధ్య‌త‌ను కూడా ఈ కేంద్రాల‌కే అప్ప‌గించ‌నున్నారు. నాలుగేళ్లకు బదులు ఐదేళ్లకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. రైతుల ఇన్సురెన్స్‌ ప్రీమియం కింద రూ.2100 కోట్లను ప్రభుత్వం అదనంగా భరిస్తోంది. రైతుల కోసం వైఎస్సార్‌ వడ్డీలేని రుణాలను అందిస్తున్నారు.

రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకువచ్చారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు రూ. 1700 కోట్లతో ఫీడర్లను ఆధునీకరించారు. రూ. 2వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేశారు. సో.. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే.. రైతుల‌కు ఇంత‌క‌న్నా ఏ ప్ర‌భుత్వ‌మూ చేయ‌లేదు.. చేయ‌బోద‌నే మాట నిర్ద్వంద్వ వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news