పెద్దాపురం ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ అదినేత జగన్ చంద్రబాబుపై మండిపడ్డారు. ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజలు ధర్మంవైపు నిలుస్తారనీ, బాబు డ్రామలను చూసి మోసపోవద్దని తెలిపారు. బాబును నమ్మితే రాక్షసిని నమ్మినట్టేనని, రాజకీయ వ్యవస్థలో నిజాయితీ, విశ్వసనీయతలు రావాలిని చెప్పుకొచ్చారు.
జగన్ మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు అగ్రిగోల్డ్ బాధితులకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. బాబు పాలనంతా మోసపూరితమే. ఆయనకు ఓటేస్తే ప్రభుత్వ పాఠశాలలు ఉండవు. జన్మభూమి కమిటీలు దోచుకుతింటాయి. ఇప్పటికే సున్న వడ్డీ రుణాలను ఎగ్గొట్టేశారు.” అని అన్నారు. ఇంకా జగన్ హామీల వర్షం కురిపించారు. రైతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిపారు. వృద్దులకు ప్రత్యేకంగా 3వేల రూపాయల పెన్షన్, ప్రతీ మే నెలలో రైతులకు 12500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. చంద్రబాబు ఈ 10 రోజులు రోజుకో సినిమా చూపిస్తారని, బాబు పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోలవరం అంచనాలను పెంచి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని వైఎస్ జగన్ మండిపడ్డారు.
రైతన్నలకు చెప్పండి.. ప్రతి మే నెలలో 12,500.. 3వేల రూపాయల పెన్షన్..
-