చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారిన రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారంటే ముందు వరుసలో ఉండేది చింతమనేని ప్రభాకర్. ఎమ్మార్వో వనజాక్షి విషయంలోగానీ అదేవిధంగా ఇసుక దోపిడీ విషయంలో చాలా రష్ గా ప్రవర్తించి అప్పట్లో ఆంధ్ర రాజకీయాల్లో పెద్ద హైలెట్ అయ్యి చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చిపెట్టారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో దళితులను బండ బూతులు తిట్టినా చింతమనేని ప్రభాకర్ ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో దెందులూరు నియోజకవర్గంలో ప్రత్యర్థి వైసీపీ పార్టీ నేత అబ్బాయి చౌదరి చేతిలో దారుణంగా ఓడిపోయారు. దీంతో ఇదే సమయంలో జగన్ ముఖ్యమంత్రి కావడంతో చింతమనేని ప్రభాకర్ పై ఉన్న కేసులు అన్ని బయటకు తీసి వాటిని విచారణ చేసి దాదాపు రెండు నెలలు జైల్లోనే పెట్టడం జరిగింది. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ పై విడుదలైన చింతమనేని ఏలూరు పొలిమేర దాట కూడదు అని బెయిల్ పిటిషన్లో కోర్టు తెలపడం జరిగింది.
అయితే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ చలో అమరావతి అనే కార్యక్రమాన్ని నిర్వహించిన క్రమంలో ఆ కార్యక్రమానికి పోలీసుల కళ్లు గప్పి వెళ్లాలని ప్రయత్నించిన పోలీసులు అడ్డుకోవడంతో చింతమనేని ఇంటికే పరిమితమయ్యారు. ఇటువంటి తరుణంలో తాజాగా ఇటీవల పోలీసుల కళ్లుగప్పి ఏలూరు పొలిమేర దాటి ఏకంగా 200 కార్లలో వందల సంఖ్యలో కార్యకర్తలతో చలో అమరావతి కార్యక్రమానికి వెళ్లడం జరిగింది. దీంతో కోర్టు ఆదేశించిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ చింతమనేని వ్యవహరించడంతో ఈసారి పర్మినెంట్ గా కటకటాల్లో జైల్లో పెట్టించే పెద్ద గిఫ్ట్ వైయస్ జగన్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.