అయితే.. ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పటికే వైద్య సేవలు ఉచితంగా అందుతున్నప్పటికీ… అది కేవలం పేదలకే దక్కుతోంది. దీంతో మధ్యతరగతి ప్రజలకు వైద్యం భారంగా మారుతోందని.. అందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయన నవరత్నాల పేరుతో ఏపీ ప్రజలకు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే.. ఏడాదికి 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి యూనివర్సల్ హెల్త్ కార్డులు తీసుకొస్తామన్నారు. పేదలకే కాదు.. 40 వేల జీతం లోపు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
వైద్యం ఖర్చులు వెయ్యి దాటితే చాలు.. ప్రభుత్వమే భరిస్తుందని జగన్ హామీ ఇచ్చారు. గుంటూరులో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగించిన జగన్.. ఈ హామీ ఇచ్చారు. సీఎం హోదాలో తానే దగ్గరుండి ఈ పథకాన్ని పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.
ఆరోగ్యశ్రీ పేదలకే పరిమితమయింది..
అయితే.. ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పటికే వైద్య సేవలు ఉచితంగా అందుతున్నప్పటికీ… అది కేవలం పేదలకే దక్కుతోంది. దీంతో మధ్యతరగతి ప్రజలకు వైద్యం భారంగా మారుతోందని.. అందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో మధ్య తరగతి ప్రజలు వైద్యం చేయించుకోవడానికి ఇక లక్షలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని సంతోష పడుతున్నారు. హెల్త్ స్కీమ్ కోసమైనా మధ్యతరగతి ప్రజలు జగన్‌కు ఓటేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.