వెంకీమామ టైటిల్ పోస్టర్ అదిరింది..!

-

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ వెంకీమామ. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఓ పక్క షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక రేపు ఉగాది సందర్భంగా ఓ రోజు ముందే వెంకీమామ చిత్రయూనిట్ అటు దగ్గుబాటి, ఇటు అక్కినేని ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. వెంకీమామ సినిమా టైటిల్ పోస్టర్ వదిలారు.

వెంకీమామ టైటిల్ పోస్టర్ చూస్తే వెంకీని ఇంగ్లీష్ లో మామని తెలుగులో అది కూడా ఓ చక్రంలో ఉంచారు. ఇక ఆ చక్రం చుట్టూ 12 రాశులు ఉన్నాయి. అంతేకాదు కుడివైపు ఆర్మీ నేపథ్యంతో కనిపిస్తుండగా ఎడమవైపు పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. సినిమాలో నాగ చైతన్య ఆర్మీ మ్యాన్ గా కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. వెంకటేష్ పల్లెటూరులో ఉంటాడని తెలుస్తుంది. మొత్తానికి వెంకీమామ టైటిల్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version