ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ వర్సెస్ వైసీపీ రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా కొనసాగుతుంది. ఓవైపు టీడీపీ కూడా అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ తరుణంలో బీజేపీ మిత్రపక్షంగా చెప్పుకునే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగులు ఒకే టీమ్ అని సజ్జల పేర్కొన్నారు. సమస్యలు ఇరు పక్షాలకు తెలుసు అని, దీని విజయం, వైఫల్యం అంటూ ఏమి లేదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఆందోళనలు ఒక ఎక్స్‌ప్రెషన్‌గానే ప్రభుత్వం చూసింది. రాష్ట్ర సొంత ఆదాయం రెండున్నర ఏండ్ల కిందట ఉన్న దగ్గరే ఆగిపోయింది. రూ.80వేల కోట్లకు పైగా ఆదాయం ఉంటే ఉద్యోగులు అడగాల్సిన అవసరమే లేదు సీఎం చెప్పారు.
మరొక వైపు టీడీపీ నేత వినోద్ జైన్ వల్ల బాలిక ఆత్మహత్య చేసుకుంటే పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణి అవలంభిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆదిపత్య ధోరణి అనే పదం అనడానికి అర్థం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. మేము అమరావతి రైతుల భూములను తాకట్టు మాత్రమే పెడుతున్నాం. టీడీపీ ఏకంగా వేలాది ఎకరాల భూములను అమ్మాలని పాలసీగానే పెట్టుకుందని పేర్కొన్నారు సజ్జల.