నేను విన్నాను.. నేను ఉన్నాను అనే టైటిల్‌తో వైఎస్ జగన్ ఉగాది పండుగ రోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 4 రోజులే సమయం ఉంది. ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకర్షించడానికి తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు రకాల హామీలను గుప్పించిన పార్టీలు గెలపు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.
అయితే.. మేనిఫెస్టో ప్రకటించినా.. ప్రజలకు ఏదైనా హామీ ఇచ్చినా.. అది ప్రజలకు ఉపయోగపడేది, ఖచ్చితంగా అమలు చేయగలిగిందే ఉండాలి తప్పితే.. లేనిపోని హామీలు, అమలు చేయలేని హామీలను గుప్పించి ప్రజలను మోసం చేయకూడదనేది వైఎస్ జగన్ సిద్ధాంతం. అందుకే.. ఆయన ఇవాళ విడుదల చేసిన మేనిఫెస్టో అమలయ్యే హామీలతో ప్రతి వర్గానికి ఉపయోగపడేదిలా ఉంది.
వైఎస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో రైతుల బతుకుల్లో వెలుగులు నింపేలా ఉంది. రైతుల కోసం వైఎస్ జగన్ తన మేనిఫెస్టోలో పెద్ద పీట వేశారు. ప్రతి రైతు ధనవంతుడు కావడమే జగన్ లక్ష్యం. పంటలకు గిట్టుబాటు ధరలు రావాలి.. ప్రతి కుటుంబానికి పెట్టుబడి సాయం కింద 50 వేలు అందజేస్తామని ఏ ప్రభుత్వమూ ఇవ్వని హామీ ఇచ్చారు.
నేను విన్నాను… నేను ఉన్నాను..
నేను విన్నాను.. నేను ఉన్నాను అనే టైటిల్‌తో వైఎస్ జగన్ ఉగాది పండుగ రోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఆయన ఇదివరకు ప్రకటించిన నవరత్నాలతో పాటు పాదయాత్రలో జగన్ ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను, ఆ సమయంలో ఆయన ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.
వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని ప్రధాన హామీలే ఇవే..
ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడికి 50 వేల రూపాయలు.
పంట వేసే సమయానికి అంటే మే నెలలోనే రూ.12500.
పంట బీమా కోసం రైతు చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
రైతుకు ఉచిత బోర్లు.
పగటి పూట ఉచితంగా 9 గంటల కరెంటు.
ఆక్వా రైతులకు యూనిట్‌కు 1.5 రూపాయలకే కరెంటు చార్జీలు.
3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి.
పంట వేయడానికి ముందే పంటలకు లభించే మద్దతు ధరల ప్రకటన, గిట్టుబాటు ధరకు గ్యారెంటీ.
నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు.
ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.
వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్, టోల్ టాక్స్ రద్దు.
కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఇవే..
కౌలు రైతులకు పంటపై హక్కు ఉండే విధంగా చర్యలు. 11 నెలలు మించకుండా కౌలు రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్ట సవరణ.
కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు. పంటలకు సంబంధించిన అన్ని రాయతీలు, సబ్సిడీలు వాళ్లకే(వాళ్లు పంట వేసిన సమయంలో).
నవరత్నాల్లో రైతులకు ప్రకటించిన ఇతర అన్ని హామీలు కౌలు రైతులకు కూడా వర్తిస్తాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 12500 రూపాయలు అదనంగా అందజేస్తారు.