రేపటి నుంచి వాళ్లు నీ ఫోన్లు కూడా ఎత్తరు లగడపాటి.. విజయసాయిరెడ్డి కౌంటర్

లగడపాటి ఎగ్జిట్ పోల్ సర్వేను నమ్మి ఎగ్జయిట్ అయిన తెలుగు తమ్ముళ్లు 23 తర్వాత తేడా వస్తే ఆయన్ను నిలదీసేట్టున్నారు. పార్టీ ఓడి, బెట్టింగుల్లో నష్టపోయినోళ్లు ఊరుకుంటారా? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్లతో లగడపాటిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

లగడపాటి తన సర్వేను టీడీపీకి అనుకూలంగా ఇచ్చారని.. ఇది నిజంగా చేసిన సర్వే కాదని.. టీడీపీకి అమ్ముడుపోయిన సర్వే అని ఏపీ అంతా కోడైకూస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా లగడపాటి ఎగ్జిట్ పోల్స్ పై ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు.

YSRCP MP Vijayasai reddy tweets on lagadapati survery

లగడపాటి ఎగ్జిట్ పోల్ సర్వేను నమ్మి ఎగ్జయిట్ అయిన తెలుగు తమ్ముళ్లు 23 తర్వాత తేడా వస్తే ఆయన్ను నిలదీసేట్టున్నారు. పార్టీ ఓడి, బెట్టింగుల్లో నష్టపోయినోళ్లు ఊరుకుంటారా? మాజీ ఎంపీవి కాబట్టి పోలీసు ప్రొటెక్షన్ అడగొచ్చు తప్పులేదు. బాబు, కిరసనాయిలు రేపటి నుంచి నీ ఫోన్లు కూడా ఎత్తరు.. అంటూ సెటైర్లు వేశారు.

రాజగోపాల్ సర్వేలో ఆయన మెదడును ఆయన డీఎన్ఏ డామినేట్ చేసిందంటూ మరో ట్వీట్ విసిరారు.

టీడీపీని సోనియా కాళ్ల ముందు చంద్రబాబు ఎప్పుడో పడేశారు..

విజయసాయిరెడ్డి… ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా ట్వీట్లతో విమర్శించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ వినాశనాన్ని కోరుకుంటుందని బోరున విలపించిన బాబు.. ఇప్పుడు చేస్తున్నదేమిటో? తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీని సోనియా, ఉత్తరాది నేతల పాదాల ముందు పడేశాడు. ఎప్పుడు కలవాలో ఎప్పుడు విడిపోవాలో ఈయనకంటే వాళ్లకు బాగా తెలుసు… అంటూ ట్వీట్ చేశారు.

చంద్రబాబును ఢిల్లీలో ఉన్న మరో పేరు ఫెవికాల్ బాబా

చంద్రబాబును ఢిల్లీలో అందరూ ఫెవికాల్ బాబా అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతూ వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్ నేమ్ తగిలించారట. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారట.. అంటూ చంద్రబాబుపై ట్వీట్ల మీద ట్వీట్ల వర్షం కురిపించారు విజయసాయిరెడ్డి. ఆయన ఇంకా చంద్రబాబుపై ఏం ట్వీట్లు చేశారో మీరే చదవండి.