స్థానిక సంస్థల ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వైయస్ జగన్. సార్వత్రిక ఎన్నికల అయిపోయిన తర్వాత మళ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల వల్ల ప్రభుత్వం పై ప్రజలకు ఉన్న అభిప్రాయం క్లియర్ కరెక్ట్ గా తేలిపోతుందని జగన్ భావిస్తున్నారు. ఇటువంటి టైములో వైసీపీ నేతలకు వీలైనన్ని మ్యాగ్జిమం స్థానాలను ఏకగ్రీవం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒకపక్క సంక్షేమ మరోపక్క అభివృద్ధి గట్టిగా జరుగుతున్న తరుణంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు వైసీపీ లోకి వచ్చేస్తున్నారు.‘అభివృద్ధి’ మరియు ‘సంక్షేమం’ అనే కిక్కుతో ఎన్నికల్లో గెలవాలని జగన్ ప్రయత్నిస్తుండగా..మరోపక్క క్లిష్టమైన ప్రాంతాలలో వైకాపా వాళ్లు దాడులకు పాల్పడుతూ వేరే కిక్కు క్రియేట్ చేస్తూ ఎలాగైనా ఇతర పార్టీలకు చెందిన నాయకులను వైసీపీలోకి లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఏపీలో వార్తలు వినబడుతున్నాయి. దీనికి నిదర్శనమే మాచర్ల లోని ఘటన అంటే చాలామంది వైసిపి పార్టీ పై విమర్శలు చేస్తున్నారు.
మరోపక్క ఇదే తరుణంలో స్థానిక ఎన్నికలు ఏ మాత్రం తేడా పడిన సంబంధిత ప్రాంతానికి చెందిన మంత్రులకు సినిమా వేరేలా ఉంటుంది అంటూ వైకాపా పెద్దలు కామెంట్స్ చేస్తున్నారట. దీంతో ఇటువంటి పరిస్థితుల్లో మ్యాగ్జిమమ్ అధికారాన్ని ఉపయోగించుకుని వైకాపా వాళ్ళు ఇతర పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలోకి లాకుంటున్నట్లు ఏపీ లో వార్తలు జోరుగా వినబడుతున్నాయి.