తెలంగాణ రాహ్త్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ఏపీలోను ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో వైసీపీ మార్పులు చేర్పులు చేస్తోంది. అటు టీడీపీ జనసేన కూటమి కూడా ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక కాంగ్రెస్ సైతం ఉనికి చాటుకునేందుకు ఆలస్యంగా రేసులోకి వచ్చింది. అయితే సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అనేక సంస్థలు సర్వేలను వెల్లడిస్తున్నాయి. మెజారిటీ సర్వే ఫలితాలు వైసీపీ కి అనుకూలంగా వస్తున్నాయి.
ప్రజలు సంతోషంగా లేరని ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా మళ్లీ వైవీపీకే ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా జన్‌మత్ పోల్స్ తాజా సర్వేలో 116 నుంచి 118 స్థానాలు వైసీపీ గెలుస్తుందని స్పష్టం చేసింది. మరోసారి ప్రజల మద్దతు సీఎం వైయస్ జగన్‌కే ఉందని తేల్చేసింది.గతంలో టైమ్స్ నౌ, పొలిటికల్ క్రిటిక్, పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం తప్పదని వెల్లడించాయి.
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో జన్‌మత్ పోల్స్ సంస్థ నిర్వహించిన పోల్స్ నిజం అయ్యాయి.అదే సంస్థ చేపట్టిన తాజా సర్వే వైసీపీకి అనుకూలంగా వచ్చింది. తాజా సర్వేలతో రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది సీఎం వైయస్ జగన్ ప్రభుత్వమేనని మరోమారు స్పష్టమైంది. పేదలకు సంక్షేమాన్ని అందిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో పరుగులు తీయిస్తున్న జగనన్న ప్రభుత్వానికి ప్రజలు మరోమారు పట్టం కట్టబోతున్నారు. జన్‌మత్ పోల్స్ అనే సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వైయస్ఆర్‌సీపీకి 116 నుంచి 118 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది.
టీడీపీ, జనసేన కూటమికి కేవలం 46 నుంచి 48 సీట్లు దక్కుతాయని తేల్చి చెప్పింది. అంతేకాదు దేశంలోనే పేరొందిన టైమ్స్ నౌ గ్రూప్-ఈటీజీ గ్రూప్ సర్వేల్లోనూ ఏపీలో 51 శాతం ప్రజలు వైయస్‌ఆర్‌సీపీకే జై కొడతారని స్పష్టమైంది. టైమ్స్ నౌ-ఈటీజీ సంస్థలకు దేశవ్యాప్తంగా అనేక ఎన్నికల్లో సర్వేలు చేసిన అనుభవం ఉంది. ఈ సంస్థలు వెల్లడించిన పలు సర్వేల అంచనాలకు తగ్గట్టే ఫలితాలు రావడం మనo గమనిస్తూనే ఉన్నాం.
పొలిటికల్ క్రిటిక్ సర్వేస్ అండ్ అనాలసిస్ సంస్థ ఇటీవల ఏపీ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలోనూ వైయస్సార్‌సీపీకి 135 వరకు వస్తాయని చెబితే.. పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో వైయస్ఆర్‌సీపీకి 48.5శాతం, టీడీపీకి కేవలం 38.2 శాతం ఓట్లు వస్తాయని తేల్చేసింది. మొత్తంమీద సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు జనంలోకి వెళ్లాయి. వాటి ద్వారా లబ్ధిపొందిన వారంతా తిరిగి వైసీపీ ప్రభుత్వానికే అండగా నిలుస్తారని, టీడీపీ జనసేన లాంటి పార్టీలు ఎన్ని వచ్చినా క ఫ్యాన్ ప్రభంజనాన్ని ఆపలేవని తేలిపోయింది. ఈ తాజా సర్వేలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు కంటిమీద కునుకు ఉండటం లేదు. పీకే లాంటి వ్యక్తులను తీసుకువచ్చి బిల్డప్ ఇచ్చినా ఎలాంటి ఫలితం ఉండబోదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.