తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల ర్యాంకింగ్స్ విడుదల

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్‌ ర్యాంకుల జాబితాను (జీఆర్‌ఎల్‌) టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. ఈ జాబితాను కమిషన్‌ వెబ్‌ సైట్‌లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరులో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సబ్జెక్టుల వారిగా అభ్యర్థులు పరీక్షలు నిర్వహించారు. పాలిటెక్నికల్ లెక్చరర్ పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్ ఆధారంగా జనరల్ ర్యాంకింగ్స్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎప్పటి నుంచి అనే సమాచారం తర్వాత ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. మీరూ ఈ పరీక్షలు రాశారా? అయితే మీకు ర్యాంక్ వచ్చిందో లేదో త్వరగా తెలుసుకోండి. మరి ర్యాంకుల జాబితా కోసం.. https://www.tspsc.gov.in/GRLPL13570AS ఈ లింక్‌ పై క్లిక్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news