ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కవితను విచారించిన ఈడీ తొలుత తీహార్ జైలుకు తరలించారు. ఆ తరువాత సీబీఐ అరెస్ట్ చేసింది. ఎమ్మెల్సీ కవిత విచారణకు సహకరించడం లేదని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. మరోవైపు కవిత సీబీఐ, ఈడీ అధికారులు తనను అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని కోర్టుకు విన్నవించుకున్న విషయం తెలిసిందే.
తాజాగా కవిత ఢిల్లీ లిక్కర్ కేసు విచారణకు తనను కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరచాలని రౌస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో తనను హాజరు పరచవద్దని కోరారు. ఆమె దరఖాస్తు పై సమాధానం చెప్పాలని ఈడీ, సీబీఐకి కోర్టు నోటీసులను జారీ చేసింది. ప్రస్తుతం తీహార్ జైలలో ఉన్న కవిత జ్యూడిషియల్ కస్టడీ ఈ నెల 07వ తేదీతో ముగియనుంది. 07న బెయిల్ మంజూరు అవుతుందా..? లేక మళ్లీ ఏమైనా పొడగిస్తారా..? అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.