ఏపీ విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులలో మార్పులు.. ఒకరోజు ఆలస్యంగా

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. సంక్రాంతి సెలవులను మార్పు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉండగా వాటిని మార్చేసింది. ఆ సెలవులను 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మార్పు చేశారు.

ఇక ఈనెల 17వ తేదీన ముక్కనుమ ఉన్నందున సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు మంత్రి బొత్స సత్యనారాయణ కు వినతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మంత్రి బొత్స సత్యనారాయణ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ విద్యాశాఖ తాజా నిర్ణయంతో ఏపీవ్యాప్తంగా 18వ తేదీన పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి. అటు తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూళ్లకు సెలవులు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. 14లో బోగి, 15న సంక్రాంతి మరియు 16న కనుమ పండుగ ఉండగా 17వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి. తిరిగి 18వ తేదీన పాఠశాలలు తెరుచుకుంటాయి. మొత్తం ఐదు రోజులు స్కూళ్లకు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం.

 

అటు తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఈనెల 13వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు మొదలుకానున్నాయి. అయితే కాలేజీ విద్యార్థులకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇవ్వనున్నారు. అంటే ఈ నెల 16వ తేదీన విద్యార్థులు తిరిగి కాలేజీలకు వెళ్లాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news