ఖమ్మంలో ట్విస్ట్: జంపింగుపై పొంగులేటి క్లారిటీ..సీటు కూడా!

-

చాలారోజుల నుంచి ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల మధ్య, బీఆర్ఎస్ నేతల మధ్య రచ్చ జరుగుతుంది. ఇదే క్రమంలో కొందరు సీనియర్లు పదవులు దక్కకపోవడంపై కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు బీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, వీరు పార్టీ మారతారని ప్రచారం ఉంది.

ఇందులో పొంగులేటిపై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలిచిన పొంగులేటి..తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనకు సీటు దక్కలేదు. అలాగే ఏ పదవి రాలేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది. కానీ తాజాగా ఆయన పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు..తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్ లోనే ఉంటానని, అదే పార్టీలో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు.

అలాగే పోటీ చేసే సీటుపై క్లారిటీ ఇచ్చారు..ఉమ్మడి ఖమ్మంలో మూడు జనరల్ సీట్లు ఉన్నాయని, వాటిల్లో ఏదొక సీటులో పోటీ చేస్తానని అన్నారు. జిల్లాలో ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం సీట్లు మాత్రమే జనరల్. ఇవి ఖాళీగా లేవు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నారు. పాలేరులో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఉన్నారు..అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు.

అయితే ఇందులో ఏ సీటు కోసం పొంగులేటి చూస్తున్నారో చెప్పట్లేదు. కానీ మూడు సీట్లు ఖాళీ లేవు. అలాగే ఖమ్మం ఎంపీ సీటులో నామా నాగేశ్వరరావు ఉన్నారు. మరి పొంగులేటికి సీటు దక్కుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news