BRS ప్రభుత్వ పనితీరును ఎండగట్టిన పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి … !

-

ఇటీవల కాంగ్రెస్ లో జాయిన్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణాలో భెరీగా వచ్చిన వరదల గురించి కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఖమ్మంలోని బొక్కలగడ్డ ముంపు వాసులు నిత్యవసర వస్తువులను అందచేశారు పొంగులేటి. గతంలో ఇదే విధంగా తెలంగాణ లో వరదలు రావడంతో కేసీఆర్ ప్రభుత్వం 1000 కోట్లు ఇస్తామని ప్రకటించింది, కానీ ఇప్పటి వరకు ఆ నిధుల సంగతి దేవుడెరుగు అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి పొంగులేటి మాట్లాడారు. గత సంవత్సరాలుగా ఈ స్థాయిలో వరదలు వచ్చింది లేదని పొంగులేటి గుర్తు చేసుకున్నారు. ఖమ్మం లో ఏ ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడకుండా కరకట్టను నిర్మిస్తామని హామీ లిచ్చి గాలికి వదిలేశారంటూ విమర్శించాడు పొంగులేటి. మరెప్పుడు ముంపుకు గురి కాకుండా ఇల్లు కట్టిస్తామని మాటిచ్చి మాట తప్పిన ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయిందంటూ విమర్శించాడు.

ఇక మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తూ గత 9 సంవత్సరాలుగా చేయని అభివృద్ధి 6 నెలల్లో చేస్తారా అంటూ సెటైరికల్ గా మాట్లాడారు పొంగులేటి. ఇక వరదల్లో మరణించిన వారికి 10 లక్షలు మరియు మునిగిన ఇంటికి 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Latest news