వెస్ట్ బెంగాల్ సీఎం గా 2010 మరియు 2011 సంవత్సరాలలో పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం విషయంగా ఉందని కోల్కతా లోని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ రోజు మధ్యాహన్మే శ్వాసకు సంబంధించి ఇబ్బందులు రావడంతో వెంటనే అతన్ని సిటీ బేస్డ్ హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని కేర్ ఇంటెన్సివ్ యూనిట్ లో పెట్టి వెంటిలేటర్ మీద చికిత్స చేస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈయన వయసు 79 సంవత్సరాలు కావడంతో ట్రీట్ మెంట్ కు కూడా బాడీ అంతగా సహకరించకపోవచ్చన్నది మెడికల్ అభిప్రాయం. కాగా హాస్పిటల్ లో బెస్ట్ డాక్టర్స్ కార్డియాలజిస్ట్ మరియు పల్మనాలజిస్ట్ లు ఇతని ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ బెస్ట్ ఇవ్వడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారట.
బుద్ధదేవ్ భట్టాచార్య ను చూసుకోవడానికి అతని భార్య మీరా భట్టాచార్య మరియు కూతురు సచేతన భట్టాచార్య అక్కడే ఉన్నారట. ఇతను వయసు రీత్యా మరియు ఆరోగ్య సమస్యల దృష్ట్యా 2018 నుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.