వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. మరో రెండు, మూడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తుంది. గత రెండు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ వన్ సైడ్ గా గెలిచేసింది. కానీ ఈ సారి టఫ్ ఫైట్ ఎదురుకోవాల్సి వస్తుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు జరిగేలా ఉంది.
అసలు సాగర్ మొదట నుంచి జానారెడ్డి కంచుకోట. చలకుర్తి నియోజకవర్గం ఉన్న దగ్గర నుంచి ఆయన సత్తా చాటుతున్నారు. 1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నెక్స్ట్ టిడిపిలో చేరి 1983, 1985 ఎన్నికల్లో గెలిచారు. నెక్స్ట్ కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఆయన వరుసగా 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో గెలిచారు. 2009లో సాగర్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పుడు కూడా ఆయన విజయం అందుకున్నారు. 2014లో కూడా జానారెడ్డి జైత్రయాత్ర సాగింది.
కానీ 2018లో ఆయన విజయాలకు బ్రేక్ పడింది. బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన నోముల నరసింహయ్య చేతిలో ఓడిపోయారు. నోముల చనిపోతే ఉపఎన్నిక రాగా, ఆ ఉపఎన్నికలో నోముల తనయుడు భగత్ చేతిలో జానారెడ్డి ఓడిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేసే ఛాన్స్ లేదు. ఆయన తనయుడు జై వీర్ రెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అటు బిఆర్‌ఎస్ నుంచి నోముల భగత్ పోటీ చేసే ఛాన్స్ ఉంది.
దీంతో ఇద్దరు వారసుల మధ్య పోరు హోరాహోరీగా జరిగే ఛాన్స్ ఉంది. అయితే సాగర్ లో బిఆర్‌ఎస్‌కు పాజిటివ్ కనిపించడం లేదు. పైగా అక్కడ ఆధిపత్య పోరు ఉంది. ఈ అంశాలు కాంగ్రెస్‌కు ప్లస్. కాస్త గట్టిగా కష్టపడితే సాగర్‌లో జానారెడ్డి తనయుడు సత్తా చాటే ఛాన్స్ ఉంది. చూడాలి మరి సాగర్ లో ఈ సారి ఏం జరుగుతుందో.