సీఎం కేసీఆర్ కు పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ 

-

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం పది రోజుల్లో వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని లేఖ ద్వారా తెలిపారు. తేదీ 24 ఫిబ్రవరి 2017 మహాశివరాత్రి పండగ రోజున రోజున ప్రగతి భవన్ సాక్షిగా, మంత్రుల సాక్షిగా, ఉన్నత అధికారుల సాక్షిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన మీరు గ్రామ రెవెన్యూ సహాయకులకు (VRA) ఇచ్చిన హామీలైన అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని, పేస్కేలు కల్పించి క్రమబద్ధీకరణ చేస్తామని గుర్తు చేశారు పొన్నం ప్రభాకర్.

55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగం కల్పిస్తామని మరియు వీఆర్ఏల సొంత గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.నేటికీ 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు.తరువాత 2020 సెప్టెంబర్ 9 రోజున అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ చట్టం ప్రవేశపెడుతూ వీఆర్ఏ లు అందరికీ పే స్కేలు కల్పించి క్రమబద్ధీకరణ చేస్తామని వారి డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రకటించి నేటికీ 22 నెలలు గడచినా మీ హామీలు అమలుకు నోచుకోలేదని ఫైర్ అయ్యారు.

 

దీనివల్ల వీఆర్ఏలు తమకు ఉద్యోగ భద్రత లేక, పదోన్నతులు లేక వీఆర్వో వ్యవస్థ రద్దుతో పెరిగిన పని భారం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వంటి కారణాలతో కొంతమంది వీఆర్ఏలు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. విధి నిర్వహణలో మరికొందరు మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు.

కావున ఇప్పటికైనా నేటి నుండి 10 రోజుల్లో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని, సిఎస్ సోమేశ్ కుమార్ గారు వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని, మానవతా దృక్పథంతో ఆలోచించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Latest news