కిడ్నీ బాధితులంద‌రికీ ఉచితంగా మందుల పంపిణీ – మంత్రి విడదల రజినీ

-

కిడ్నీ బాధితులంద‌రికీ ఉచితంగా మందుల పంపిణీ చేస్తున్నామని మంత్రి విడదల రజినీ పేర్కొన్నారు.ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్ర‌భావం చూపుతున్న నేప‌థ్యంలో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు అందుతున్న వైద్య సేవ‌లు, ప్ర‌భుత్వం నుంచి అందుతున్న ఫ‌లాలు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో తెలుసుకునేందుకు మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారితో పాటు, వైద్య ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారులు ప్రాంత ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు.

ఈ సందర్భంగా కిడ్నీ రోగుల‌తో ప్ర‌త్య‌క్షంగా మాట్లాడారు. అనంత‌రం దీప్లాన‌గ‌ర్‌కు వెళ్లారు. అక్క‌డి కిడ్నీ వ్యాధి బాధితుల‌తో మాట్లాడారు. స్థానిక స‌మ‌స్య‌ల‌పై అక్క‌డి వారితో చ‌ర్చించారు. అక్క‌డి నుంచి ఎ.కొండూరు పీహెచ్‌సీని సంద‌ర్శించారు. కిడ్నీ వ్యాధి రోగుల‌కు అక్క‌డ అందుతున్న సేవ‌ల‌పై ఆరా తీశారు. అందుబాటులో ఉన్న మందులు, వ్యాధి నిర్థార‌ణ‌ ప‌రిక‌రాలను ప‌రిశీలించారు. ఆయుష్ వైద్య‌శాల‌లో కొత్త‌గా ఏర్పాటుచేయ‌బోతున్న డ‌యాల‌సిస్ కేంద్రాన్ని త‌నిఖీచేశారు. ఈ సంద‌ర్భంగా అడుగ‌డుగునా సిబ్బందికి మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందించారు. అనంత‌రం ఎం.కొండూరు మండ‌లంలోని వైద్య సిబ్బంది, పీహెచ్‌సీ సిబ్బంది అంద‌రితో క‌లిపి స‌మీక్ష నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news