టాలీవుడ్ నాకు ప్రాణం : క్లారిటీ ఇచ్చిన పూజ

ముకుందా అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన పూజా హెగ్డే ఆ తరువాత చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరిగింది. తెలుగు ప్రేక్షకులందరూ తనని తొడలతో చూడాలని అలానే నడుము చూడాలి అనుకుంటారు అని చెప్పుకొచ్చింది.

నేను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. అక్షరాన్ని మార్చగలరేమో అభిమానాన్ని కాదని కూడా ఆమె పేర్కొంది. నాకు ఎప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రాణ సమానం అని ఆమె పేర్కొంది. అలానే ఈ విషయాలు అన్నీ తనను తన సినిమాని అభిమానించే వారికీ, నా అభిమానులకూ తెలిసినా, ఎటువంటి అపార్ధాలకూ తావివ్వకూడదనే నేను మళ్ళీ చెబుతున్నానని పేర్కొంది. అలానే నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడిఉంటానని ఆమె చేబుతున్నట్టున్న ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు ఆమె మేనేజర్.