రేపు ఏపీకి కేంద్ర బృందాలు.. రెండు రోజులు అక్కడే !

రేపట్నుంచి రెండు రోజుల పాటు ఏపీ రాష్ట్రంలో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కోసం రాష్ట్రానికి మూడు కేంద్ర బృందాలు బయలు దేరాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంత జిల్లాల్లో పర్యటించనున్నాయి ఈ కేంద్ర బృందాలు. రేపు కృష్ణా, గుంటూరు, అనంత జిల్లాల్లో ఈ మూడు బృందాల పర్యటన సాగానుండగా ఎల్లుండి ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు బృందాల పర్యటన జరగానుంది.

ఇటీవల భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ కేంద్ర బృందం పర్యటించి పంట నష్టం అంచనా వేయనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ నేతృత్వంలోని బృందం ఏపీకి వస్తోంది. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని ఈ బృందం అంచనా వేయనుంది. దాదాపుగా 15 వేల కోట్ల వరద నష్టం వచ్చినట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే కేంద్ర బృందాలు వేసిన అంచనా ప్రకారమే కేంద్ర ప్రభుత్వం పంట నష్టం విడుదల చేస్తుంది.