పెళ్లి పై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్.. అలా అయితేనే చేసుకుంటా !

-

టాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముకుంద సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పూజ హెగ్డే… ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం రాధేశ్యాం లాంటి పాన్ ఇండియన్ మూవీ లోనూ నటించింది పూజా హెగ్డే. అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి విషయం పై షాకింగ్ కామెంట్స్ చేసింది పూజ హెగ్డే.

“ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు కదా… సో అవి చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ మధ్యనే నేను ముంబై లో ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకోవడమే ఇలా ఉంటే ఒక పెళ్లి ఎలా ఉంటుందో. ఇల్లు కట్టుకోవడం ఇలా ఉంటే ఇక పెళ్లి ఎలా ఉంటుందో.. కానీ నేను నమ్మేది ఒకటే.. వీళ్ళతో జీవితాంతం కలిసి ఉంటే బాగుంటుంది అనిపిస్తేనే పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో ఒత్తిడివల్ల లేక అందరు పెళ్లి చేసుకుంటున్నారు అని మాత్రం పెళ్లి చేసుకోకూడదు ” అంటూ పూజ అభిప్రాయపడింది.

Read more RELATED
Recommended to you

Latest news