“పుష్ప” నుంచి మరో అప్డేట్..బన్నీ ఫ్యాన్స్ కు ఇక జాతరే

-

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, ప్రస్తుతం చేస్తున్న మూవీ పుష్ప. ఈ సినిమాకు టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్ట్స్‌ గా రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే. ఈ పాన్‌ ఇండియా మూవీ లో ఐకాన్‌ స్టార్‌ హీరో బన్నీకి జోడీగా శ్రీ వల్లి పాత్ర లో రష్మిక మందనా నటిస్తోంది. చిత్రంలో ఫహద్ ఫాసిల్​, సునీల్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదల పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచగా…. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో లో అల్లు అర్జున్‌ షూటింగ్‌ స్పాట్‌ ను చాలా శుభ్రంగా ఉంచాలని.. షూటింగ్‌ జరిగినన్ని రోజులూ ఎవరి ప్లాస్టిక్‌ బాటిళ్ల ను, ప్లాస్టిక్‌ కప్పులను వారే క్లీన్‌ చేసు కోవాలని స్పాట్‌ లోని నటీ నటులు, సిబ్బందిని రిక్వెస్ట్‌ చేయడం మనకు కనిపించింది. కాగా.. ఈ సినిమా ట్రైలర్‌ రేపు విడుదల కానుండగా.. సినిమా మాత్రం.. డిసెంబర్‌ 17 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news