ఆ రాక్షసుడికి శిక్ష పడింది..నేను హ్యాపీ : పూనమ్ కౌర్

-

మహిళలపై తన ఆశ్రమంలో లైంగిక దాడులకు పాల్పడిన ఘటనలో డేరా బాబా కు జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పును సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ తనదైన స్టైల్ లో స్పందించింది. “ఆయుధాలతో అమ్మాయిలను బెదిరిస్తూ దారుణాలకు పాల్పడుతున్న.. తనను తాను దేవుడిగా భావిస్తున్న రాక్షసుడికి శిక్ష పడింది. తనను గురువుగా చెప్పుకునే దుర్మార్గుడి శిక్ష పడటం నాకు ఆనందంగా ఉంది. హర్యానా రాష్ట్రంలో మహిళలపై అణచివేత ఎక్కువగా ఉంటుంది. అణచివేత ఎక్కువగా కనిపిస్తుంది.

కానీ చట్టం దాన్ని పెద్దగా పట్టించుకోదు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు నేరస్తులకు శిక్ష వేసింది.” అంటూ తన ట్విట్టర్ లో పూనమ్ పేర్కొంది. ఇదిలా ఉంటే పూనమ్ కౌర్ టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా వివాదాల హీరోయిన్ గా పూనమ్ కౌర్ ఎక్కువగా పాపులర్ అయింది. ఇప్పటికీ సామాజిక…. రాజకీయ అంశాల పై తనదైన స్టైల్ లో స్పందిస్తూ పూనమ్ కౌర్ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news