పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్.. పీకే లవ్ అంటూ ఫోటోలు పెట్టేసింది..!

-

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. చూడ్డానికి ముద్దుగుమ్మ లా ఉండే ఈ బ్యూటీ కి అవకాశాలు మాత్రం అనుకున్నట్టు రాలేదు. అంతే కాకుండా ఇతర వివాదాలు కూడా పూనమ్ కెరీర్ ను దెబ్బ తీసాయని ఇండస్ట్రీలో టాక్. ఇదిలా ఉంటే పూనమ్ సోషల్ మీడియా లో ఆసక్తికర ట్వీట్ లు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో లోనే తాజాగా పీకే లవ్ అనే యాష్ టాగ్ తో తన ఫోటోలను పూనమ్ కౌర్ షేర్ చేసింది.

అయితే పవన్ కళ్యాణ్ ను కూడా అభిమానులు పికే అని పిలుచుకుంటారు అన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇటీవల పోసాని కృష్ణ మురళి మరియు కొందరు రాజకీయనాయకులు పూనమ్ కౌర్ ను పవన్ మోసం చేశారని వ్యాఖ్యానించారు. దాంతో పూనమ్ పీకే అనే యాష్ టాగ్ ను ఎందుకు వాడిందా అని అనుమానిస్తున్నారు. కన్ఫ్యుజ్ చేయొద్దని ఏదైనా ఉంటే నేరుగా భయట పెట్టాలని కోరుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news