నో డౌట్: బీజేపీకి పవన్ దూరం… పెద్ద కథే నడిచిందటా!

-

ఏమైందో ఏమో గానీ…సడన్‌గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు…ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున గళం విప్పారు. సినిమా టికెట్ల విషయంలో జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. రోడ్లపై పడిన గుంతలని పూడ్చే కార్యక్రమం చేశారు. ఇక వైసీపీతో యుద్ధమే అని పవన్ ప్రకటించేశారు.

pawankalyan
pawankalyan

అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది గానీ….ఆ తర్వాత నుంచే ప్రజల్లో డౌట్ రావడం మొదలైంది. తన మిత్రపక్షం బి‌జే‌పిని సైడ్ చేసి పవన్ వైసీపీ మీద యుద్ధం ప్రకటించారు. ఇదే సమయంలో వైసీపీపై మాత్రమే యుద్ధం చేయడం వల్ల ఉపయోగం లేదు….ఎందుకంటే బలంగా ప్రతిపక్ష టి‌డి‌పి కూడా ఉంది. రెండు పార్టీలపై యుద్ధం చేస్తే జనసేనకు బెనిఫిట్. కానీ పవన్ అలా చేయలేదు….గత కొన్ని రోజులుగా పవన్ చేసిన రాజకీయం బట్టి చూస్తే బి‌జే‌పికి దూరంగా, టి‌డి‌పికి దగ్గరగా జరుగుతున్నారని అర్ధమవుతుంది.

కాకపోతే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు గానీ, కాస్త విశ్లేషణ చేస్తే అదే నిజమనిస్తుంది. అయితే ఉన్నట్టుండి పవన్…బి‌జే‌పికి దూరం జరగడానికి కారణాలు లేకపోలేదట. ఏపీలో బి‌జే‌పి బలపడలేకపోతుంది. అయితే పవన్ లాంటి వారు ఉంటే బలోపేతం అవుతుందని కేంద్ర అధిష్టానం భావించిందట…కాకపోతే పొత్తు కాకుండా జనసేనని బి‌జే‌పిలో విలీనం చేస్తే బెటర్ అనే ప్రతిపాదన పవన్ ముందు పెట్టారట. దీనికి పవన్ ససేమిరా అనేసి, జనసేనని ప్రజారాజ్యం మాదిరి చేయకుండా, ఒంటరిగానే బలపడాలని ఫిక్స్ అయ్యి, వైసీపీపై యుద్ధం మొదలుపెట్టారని తెలిసింది. అలాగే బద్వేలు ఉపఎన్నికలో పోటీ చేయమని చెప్పి బి‌జే‌పికి గట్టి షాక్ ఇచ్చారు.

ఇక అక్కడ నుంచే బి‌జే‌పికి పవన్ దూరమైపోయారని తెలుస్తోంది. ఈ విషయాలపై క్షేత్ర స్థాయిలో జనసేన వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి పవన్….బి‌జే‌పికి దూరమయ్యి, టి‌డి‌పికి దగ్గరవుతున్నారని దాదాపు క్లారిటీ ఇచ్చేసినట్లే కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news