పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ వ్యవహారం ఎప్పటికీ తేలనిదే. కత్తి మహేష్ పెట్టిన చిచ్చు.. ఎంతోమందిలో ఇంకా మెదులుతూనే ఉంది. పవన్ కళ్యాణ్-పూనమ్ కౌర్ మధ్య ఏదో ఉందని, వారిద్దరు పూజలు ఎందుకు చేశారని? ఆమె హాస్పిటల్ బిల్స్ పవన్ ఎందుకు కట్టారని? కత్తి మహేష్ వేసిన ప్రశ్నలు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ విషయాలన్నీ పక్కన బెడితే ఎప్పుడో మరుగున పడిపోయిన పూనమ్ కౌర్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
సినిమాలు చేసినంత కాలం రాని పాపులార్టీ కత్తి మహేష్ ఆరోపణలతో వచ్చింది. ఇక అప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఏదో ఒక ట్వీట్ పెట్డడం, అందులో ఎవరిని పొగుడుతుందో, ఎవరిని తిడుతుందో తెలియకుండా దాగుడు మూతలు ఆడటంతో మరింత ఫేమస్ అయింది. అయితే ఏదో రకంగా వార్తల్లో ఉండే పూనమ్.. ఆ మధ్య మీడియాపైనా ఫైర్ అయింది. ఇష్టమొచ్చినట్టుగా వార్తలు రాస్తున్నారంటూ అంత ఎత్తుకు లేచింది.
తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ పవన్‌పై ఉన్న ప్రేమను చాటేలా ఉందన్న అనుమానం కలుగుతోంది. ‘డబ్బు హోదా ఉన్నవాడు రాజు అవ్వొచ్చు గానీ, ప్రేమ త్యాగం న్యాయం కోసం పోరాడేవాడు వీరుడవుతాడు. రాజులు శాసిస్తారు.. వీరులు మిమ్మల్ని కాపాడుతారు.శాసించాలి అనే తపన పడే వ్యక్తిలో అహంకారం ఉంటుంది..అందరూ బాగుండాలనే వ్యక్తిలో ప్రేమ, వైరాగ్యం ఉంటుంద’ని ఓ కవిత్వం రాసింది. ఇది తానే రాసినట్టుగా, తన స్నేహితుడు అనువదించినట్టుగా చెప్పుకొచ్చింది. పీకేలవ్, జై హింద్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టేసింది. అయితే ఇందులో పీకే అంటే పవన్ కళ్యాణ్ అనో మరి పూనమ్ కౌర్ అనో.. ఆమెకే తెలియాలి.