బావ సినిమా కి వచ్చాను అక్కా… వాట్సాప్ స్క్రీన్ షాట్ ని పోస్ట్ చేసిన పూనమ్ కౌర్

-

పూనమ్ కౌర్ పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా వెలుగొందింది ఈ భామ. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకున్నా ఏదో ఓ న్యూస్ లో ట్రెండింగ్ లో ఉంటోంది. ముఖ్యంగా తన సోషల్ మీడియాలో ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ.. ప్రచారంలో ఉంటుంది పూనమ్ కౌర్. ముఖ్యంగా టాలీవుడ్ లోని ప్రముఖులపై, హీరోలపై గతంలో కొన్ని వివాదాస్పద ట్విట్లు చేసింది. తాజాగా పవన్ కళ్యాన్ పై వర్మ ఓ ట్విట్ చేశారు. ప్రి రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ హుందాగా మాట్లాడాని ఆయన అన్నారు. దీంతో వర్మ ట్విట్ పై పూనమ్ కౌర్ మరో ట్విట్ పెట్టింది.

తాజాగా పూనమ్ కౌర్ పెట్టిన ఓ ట్విట్ తెగ వైరల్ అవుతుంది. ఓ వాట్సాప్ చాట్ ను ట్విట్టర్లో పెట్టింది పూనమ్ కౌర్. ‘‘ సినిమాకు వచ్చిన అక్క.. బావ సినిమాకు… నిజం చెబుతున్న సినిమా హిట్’’ అంటూ.. కామెంట్లు ఉన్న వాట్సాప్ చాట్ ను తన ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ ట్విట్ పవన్ కళ్యాన్ తాజా సినిమా ‘ భీమ్లానాయక్’ గురించే అంటున్నారు పవన్ ఫ్యాన్స్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version