మలయాళ కుట్టి పూర్ణ.. అసలు పేరు శామ్న కాషిం. కాగా, ‘ఢీ’ పూర్ణగానే ఆమె బాగా పాపులర్. మలయాళ ఇండస్ట్రీలో కథానాయికగా పరిచయమైన ఈ సుందరి.. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి ఫేమస్ అయింది. శ్రీమహాలక్ష్మి ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుసగా పలు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఈమె బుల్లితెరపైన సెటిల్ అయిపోయిందని చెప్పొచ్చు.
‘ఢీ’ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరో వైపున సినిమాలు చేస్తున్నది. అలా బుల్లితెర, వెండితెర రెండిటినీ బ్యాలెన్స్ చేస్తోంది. ఇక ఈ సుందరి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈమె షేర్ చేసే ఫొటోలు చూసి నెటిజన్లు సంబురపడిపోతుంటారు. ఈ అందాల భామ సొగసులు చూడతరమా అని మైమరిచిపోతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ భామ గులాబీ రంగు చీర కట్టి చేసిన రీల్స్ వీడియో ఒకటి షేర్ చేసింది. సదరు వీడియోలో పూర్ణ చాలా అందంగా కనబడుతోంది.
మామూలుగానే అందంగా కనబడే పూర్ణను గులాబీ రంగు చీరలో చూసి.. వామ్మో హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొప్పున మల్లెపూలు పెట్టి అలా చీర కట్టులో పరువాలన్నీ చూపుతూ ఫ్రంట్, బ్యాక్ స్టిల్స్ ఇస్తూ.. నడుచుకుంటూ ముందుకెళ్తు్న్న పూర్ణను చూసి వావ్ అంటున్నారు.
కంప్లీట్ పింక్ కలర్ డ్రెస్ లో అనగా పింక్ శారీ, బ్లౌజ్ లో తగు ఆభరణాలు ధరించిన పూర్ణను చూసి నెటిజన్లు, అభిమానులు ‘సో గార్జియస్, లవ్ యూ , బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య ‘అఖండ’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ఈ భామ.. ప్రజెంట్ ‘విస్తిత్రం’ అనే తమిళ చిత్రంతో పాటు ‘వృత్తం’ అనే మలయాళ ఫిల్మ్‌లో నటిస్తోంది. ఈ భామ నటించిన ‘బ్యాక్ డోర్’ అనే తెలుగు చిత్రం ఇటీవల విడుదలైంది. అయితే, ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయింది.
https://www.instagram.com/reel/CbuI2D3FdEN/?utm_source=ig_web_copy_link