జూనియర్ ఎన్టీఆర్ ఇలా చేస్తే సీఎం కావడం ఖాయం…!

-

ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడంపై ఏదోక రూపంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయంగా బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆయన అండగా నిలవాలని, చంద్రబాబు ఆయన పెద్ద పీట వేసి లోకేష్ ని పక్కకు తప్పించాలని జూనియర్ అభిమానులతో పాటు తెలుగుదేశంలో ఉంటూ నందమూరి కుటుంబాన్ని అమితంగా అభిమానించే వాళ్ళు పదే పదే,

జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆయనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని తెలిసినా సరే కొందరు పదే పదే ఆయన ముఖ్యమంత్రి కావాలంటూ వాళ్ళ ఇష్టాలను ఆయన మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తాజాగా సిని నటుడు పోసాని కృష్ణమురళి కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఓ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఎలా అవ్వాలో చెప్పారు.

ప్రజల్లో నమ్మకం ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్న ఆయన, లేకపోతే చంద్రబాబు లాగా మోసం చేసే తెలివితేటలైనా ఉండాలని సూచించారు. సీనియర్ ఎన్టీఆర్ తన విల్ పవర్ తో సీఎం కాగలిగారన్న పోసాని, జూనియర్ ఎన్టీఆర్ సైతం నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ఉంటే కచ్చితంగా సీఎం అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పోసాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news