ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో శుక్రవార౦ సమావేశమైంది. సమావేశం ముగిసిన అనంతరం మాట్లాడిన పురపాలక శాఖా మంత్రి బొత్సా సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి ప్రాంత అభివృద్ధి తమ బాధ్యత అని మంత్రి బొత్సా అన్నారు. హైపవర్ కమిటి సమావేశ వివరాలను ముఖ్యమంత్రి జగన్ కు వివరించామని అన్నారు.
అమరావతి రైతులపై తమకు సానుభూతి ఉందన్న ఆయన 13 జిల్లాల్లో అమరావతి ఒక భాగమని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకి వెళ్తామని బొత్సా అన్నారు. అమరావతి రైతులు చంద్రబాబు మాయలో పడవద్దని అన్నారు. మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో అన్నీ చర్చిస్తామని అన్నారు. మూడు రాజధానుల అమలు దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.
సిఆర్దియే రద్దు గురించి తనకు తెలియదు అని, మీకు ఎవరు చెప్పారని మీడియాను ప్రశ్నించారు బొత్సా. రైతుల సలహాలు సూచనలకు నేడు తుది గడువు అన్నారు. అసలు చెన్నై ఐఐటి నుంచి తాము ఏ నివేదిక తీసుకోలేదు అన్నారు. అమరావతిలో ఉన్న తాత్కాలిక భవనాలను ప్రత్యామ్నా అవసరాలకు వినియోగిస్తామని, సచివాలయం శాశ్వతమని చంద్రబాబు చెప్తే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అన్నారు బొత్సా.
అమరావతిపై చంద్రబాబు అఖిలపక్షం కోరలేదు. రాజధాని మార్పు గురించి కేవలం అసెంబ్లీలోనే ప్రకటన చేసామని అన్నారు. 20 న జరిగే కేబినేట్ భేటీలో అన్ని విషయాలను మంత్రుల ముందు ఉంచుతామని అన్నారు. ఇక ఈ సందర్భంగా జనసేనపై కూడా బొత్సా విమర్శలు చేసారు. ఇప్పుడు ఆ పార్టీకి జ్ఞానోదయం అయిందా అని ప్రశ్నించారు. అమరావతి రైతులకు మరింత లబ్ది కలిగే విధంగా సిఎం సూచనలు చేసారని అన్నారు.