పోస్ట్ ఆఫీస్ నుండి అదిరే స్కీమ్.. ప్రతీ నెలా రూ.8,875..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది వాళ్లకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఇలా స్కీమ్స్ లో డబ్బులు పెడితే మంచిగా డబ్బులు వస్తాయి. పైగా భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండదు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2023లో మధ్య తరగతి ప్రజలకు శుభవార్త ని అందించింది. మహిళల కోసం కొత్త పథకాన్ని తీసుకు వచ్చింది. అదే విధంగా పలు స్కీమ్స్‌పై ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ ని కూడా పెంచేసింది.

పూర్తి వివరాలని చూస్తే.. ఈ స్కీమ్ వల్ల డబ్బులు దాచుకోవాలని అనుకునే వారికి ఊరట కలుగుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ పెంచిన స్కీమ్స్‌లో పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒకటి. రూ. 4.5 లక్షల నుంచి రూ. 9 లక్షలకు దీన్ని పెంచనున్నారు. అదే ఒకవేళ మీరు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లో
జాయింట్ అకౌంట్ తెరిస్తే అప్పుడు రూ. 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.

సీనియర్ సిటిజన్స్ దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఇప్పుడు దీని మీద 7.1 శాతం వడ్డీ వస్తోంది. ప్రతి నెలా ఈ వడ్డీ డబ్బులు చెల్లిస్తారు. ఈ వడ్డీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోక పోతే అప్పుడు ఎలాంటి వడ్డీ రాదు. కనుక ప్రతి నెలా డబ్బులు విత్‌డ్రా చేసుకుంటూ ఉండాలి.

ఎవరు అర్హులన్నది చూస్తే.. పదేళ్లకు పైన వాళ్ళెవరైనా సరే దీనిలో చేరవచ్చు. రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా రూ. 592 వస్తాయి. ఒకవేళ మీరు ఐదు లక్షలు పెడితే రూ. 2958 వస్తాయి. రూ. 10 లక్షలు అయితే రూ. 5916 పొందొచ్చు. మీరు కనుక ఈ స్కీమ్ లో రూ. 15 లక్షలు పెడితే రూ. 8875 వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news