ఛాతిలో నొప్పితో దూకేసిన ఆర్టీసీ డ్రైవర్‌.. లగ్జరీ బస్సు బోల్తా

-

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

అసలేం జరిగిందంటే.. ?

ఆసిఫాబాద్ శివారుకు చేరుకున్న తర్వాత ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఛాతిలో నొప్పి రావడం మొదలైంది. దీంతో భయాందోళనకు గురైన డ్రైవర్ ఒక్కసారిగా బస్సులో నుంచి దూకేశాడు. డ్రైవర్ దూకేయడంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి గుంతలో బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రయాణికులు గాయపడ్డారు. మరోవైపు దూకేసిన ఆర్టీసీ డ్రైవర్ కూడా గాయపడటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news