పాలకి ప్రత్యామ్నాయం.. బంగాళ దుంప పాలు.. కొత్తగా లాంచ్ చేసిన స్వీడన్ కంపెనీ..

-

పొద్దున్న లేవగానే టీ, కాఫీ తాగకపోతే తెల్లారని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన భారతదేశంలో. బెడ్ మీద నుండి దిగకముందే కాఫీ నోట్లో పోసుకునే వాళ్ళు ఎంతో మంది. ఇవన్నీ పాలతో తయారయ్యేవే. అందుకే పాలు మన వంటింట్లో అనివార్యమైనవి. పాలకు బదులు వేరే ఏ పదార్థాలను పెద్దగా ఇష్టపడరు. కాకపోతే కొందరికి కొన్ని కారణాల వల్ల పాలు ఒంటికి పడవు. దానివల్ల వారు పాల పదార్థాలను ముట్టుకోరు. అలాంటి వారికి ప్రత్యామ్నాయం అవసరం.

ఈ విషయాన్ని గుర్తించిన స్వీడన్ కంపెనీ, బంగాళ దుంప పాలను తీసుకొచ్చింది. గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వీడన్ కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం, ఈ బంగాళ దుంప పాలు తయారు చేయడం చాలా సులభం. బంగాళ దుంపలను ఉడకబెట్టి అందులో రాప్సీడ్ ఆయిల్, బఠాణీలు, ప్రోటీన్లతో కలిపి ఈ ద్రావణాన్ని తయారు చేస్తారు. ఇలా తయారైన పాలు, గ్లూటెన్ లేకుండా, చక్కెర లేకుండా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పాలకి బదులుగా ఈ బంగాళ దుంప పాలు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది.

బంగాళ దుంప పాల వల్ల కలిగే ప్రయోజనాలు

బంగాళ దుంప పాలలో విటమిన్ డి, విటమిన్ బీ12 పుష్కలంగా ఉంటాయి. అనేక ఖనిజాలు, లవణాలు ఇందులో భాగం. అదీగాక విటమిన్ ఏ, సీ, డి, కే కలిగి ఉంటుంది. ఆవు పాల కన్నా తక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి కాబట్టి చాలా సులభంగా జీర్ణం అయ్యే అవకాశం ఉంది.

ఎలాంటి వారు తీసుకోవాలి?

డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు, అజీర్తి మొదలగు ఇబ్బందులతో బాధపడుతున్న వారు బంగాళ దుంప పాలను తీసుకోవడం చాలా మంచిది. ఎలాంటి చక్కెర, గ్లూటెన్ లేవు కాబట్టి వీరికి మేలు కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news