ఆన్‌లైన్‌లో పీపీఎఫ్‌ ఖాతాలో డబ్బు జమచేసుకోండిలా..!

-

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), పన్ను ఆదా పథకం. ఇందులో ఏడాదికి 7.1% వడ్డీ ఉంటుంది. పీపీఎఫ్‌తో పాటు మరిన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఈ నెల నుంచి మార్చి త్రైమాసికానికి కేంద్ర ప్రభుత్వం మార్చలేదు. పబ్లిక్‌ ప్రావిడెంగ్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) పదిహేళ్లకు మెచ్యూర్‌ అవుతుంది. ఈ ఖాతాను నిరంతరం కొసాగించడానికి ఏడాదికి కనీసం రూ. 500 డిపాజిట్‌ చేయాలి.పోస్టాఫీస్‌ పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌)తో పాటు మరో తొమ్మిది రకాల పొదుపు పథకాలను పోస్టల్‌ శాఖ అందుబాటులో ఉంచింది. ఈ పథకాన్నీ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద పన్ను రాయితీ ఉంది. పీపీఎఫ్‌ ఖాతా తెరిచేందుకు ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) యాప్‌తో ఆన్‌లైన్‌లో నిర్వహించిన తర్వాత ఒక్కసారి పోస్టాఫీకు వెళ్లాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో బదిలీ పక్రియ ఇలా..

1.ముందుగా మీ బ్యాంక్‌ ఖాతా నుంచి∙ఐపీపీబీ ఖాతాకు డబ్బులు యాడ్‌ చేయాలి.

2. డీపీఓ పొడక్ట్స్‌కు వెళ్లి, పీపీఎఫ్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి.
3. మీ యొక్క పీపీఎఫ్‌ ఖాతా నంబర్‌ను నమోదు చేసిన తర్వాత కస్టమర్‌ ఐడీని డీపీఓకు చేయాలి.
4. చివరికిగా వాయిదాల కాలం, మొత్తాన్ని ఎంచుకోవాలి.
5. ఐపీపీబీ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా విజయవంతంగా బదిలీ అయినట్లు మీకు మెసెజ్‌ ద్వారా తెలుçస్తుంది.

డిజిటల్‌ చెల్లింపులు..

ప్రభుత్వం డిసెంబర్‌ చివరి వారంలో ‘డాక్‌ పే’ డిజిటల్‌ లావాదేవీల యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీన్ని పోస్లాఫీస్, మరియు ఐపీపీబీ వినియోగదారులూ ఉపయోగించవచ్చు. డాక్‌పే ఇండియా పోస్ట్, ఐపీపీబీ అందించే డిజిటల్‌ ఫైనాన్షియల్, అసిస్టెడ్‌ బ్యాంకింగ్‌ సేవలను అందిస్తుంది. ఇది డబ్బు పంపడం, క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం, వ్యాపారులకు డిజిటల్‌గా చెల్లింపు సేవలను కూడా సులభతరం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news