‘ఆ’ పోర్న్ చూశారని ఇద్దరు అరెస్ట్ !

ఇన్‌స్టాగ్రామ్‌తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అలానే కొన్ని ఇ-కామర్స్ వెబ్ సైట్స్ ఉపయోగించి చైల్డ్ పోర్న్ ను కొనుగోలు చేసి, విక్రయించినందుకు ఇద్దరు వ్యక్తులను ఢిల్లీలో అరెస్టు చేశారు. నిందితులు నీరజ్ కుమార్ యాదవ్ మరియు కుల్జీత్ సింగ్ మకాన్ లు 2019 నుండి పిల్లల అశ్లీల చిత్రాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం అలానే అమ్మారని ఈ ఇద్దరిని అరెస్టు చేసిన తరువాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తెలిపింది.

వారు వేరే వ్యక్తి నుండి మైనర్లకు సంబందించిన పోర్న్ ఉన్న డేటాను పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారని, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం ద్వారా డబ్బు అందుకునే వారని అంతే కాక క్లౌడ్ ఆధారిత వెబ్‌సైట్లలో ఈ పోర్న్ ని సేవ్ చేసి ఉంచారని సీబీఐ చెబుతోంది.  ఇక  పేటీఎం, గూగుల్ పే ద్వారా చెల్లింపులు అందుకున్న తర్వాత వీరు వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అశ్లీల వెబ్ సైట్ లింకులు షేర్ చేసేవారని సిబిఐ తెలిపింది.