ప్ర‌భాస్ `రాధే శ్యామ్` ఫస్ట్ లుక్ వ‌చ్చేది ఎప్పుడంటే..?

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తాజా సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న విషయం తెల్సిందే. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రభాస్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట జాను అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత.. ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ పరిశీలనలో పెట్టారు.

త్వ‌ర‌లోనే ఈ రెండిటిలో ఓ టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట డైరెక్టర్ రాధాకృష్ణ. పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోందని, ఇందులో ప్రభాస్ పాత్ర గతంలో ఎన్నడూ చూసని విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో వేసిన పలు సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఒక లాంగ్ షెడ్యూల్ కోసం జార్జియా షిఫ్ట్ కానుంది. మార్చి 2న ఈ చిత్ర టీం జార్జియా వెళ్లనున్నారు. మార్చి 4నుండి 25 రోజులు కంటిన్యూగా అక్కడ షూటింగ్ జరపనున్నారు.

ఈ షెడ్యూల్ పూర్తయ్యే సమయానికి ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. మ‌రో 15 రోజుల్లో లేదా ఉగాదికి పక్కాగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్న‌ట్టు స‌మాచారం. కాగా, భారీ హంగులతో రూపొందుతున్న ఈ సినిమాను దసరా సీజన్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. ఈ మేరకు అక్టోబర్ 16ను విడుదల తేదీగా లాక్ చేశారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news