Prabhas25 :అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ

-

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తో… పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. బాహుబలి సినిమా తో దేశ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నాడు హీరో ప్రభాస్. ఆయన సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్నాయి. ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యాం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే ఆది పురుష్, సలార్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

అయితే తాజాగా మరో సినిమాను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు ప్రభాస్. ప్రభాస్ కెరీర్లో 25 సినిమాగా నెక్స్ట్ మూవీ రూపొందుతోంది. ఇక ఈ సినిమాను రేపు ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే దానిపై ఇప్పటి వరకు రాలేదు.

రేపు వచ్చే అప్డేట్ లో డైరెక్టర్ పేరును అనౌన్స్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్జున్ రెడ్డి ఫ్రేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో… ప్రభాస్ 25వ చిత్రం తెరకెక్కుతున్న ట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాను అర్జున్ రెడ్డి యాంగిల్లో చూపించిన ఉన్నారట దర్శకుడు సందీప్ రెడ్డి. అయితే దీని పై క్లారిటీ రావాలంటే మరో కొన్ని గంటలు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news