Venkatesh: పెదవి విప్పే ముందు అన్నీ… సామ్- చైతూ విడాకులపై వెంకీ మామ సెటైరికల్ పోస్ట్

-

Venkatesh: ఇప్పుడు ఇండస్ట్రీలో న‌డుస్తున్న హాట్ టాపిక్ సామ్ చైతూ ల డివోర్స్. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌గా గుర్తింపు పొందిన వీర‌ద్ద‌రూ త‌మ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. కానీ ఈ విష‌యాన్ని అక్కినేని అభిమానులుగానీ, సామ్ అభిమానులుగానీ జీర్ణించుకోలేక పోతున్నారు. అసలు వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగి ఉండొచ్చు? ఎందుకు అంత పెద్ద నిర్ణ‌యం తీసుకున్నార‌ని చ‌ర్చించుకుంటున్నారు. కొంతమంది అయితే.. సమంత ఇమేజ్ ని బ్యాడ్ చేసేలా కామెంట్ చేస్తున్నారు. మ‌రికొంద‌రూ అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు.

ఈ పరిస్థితుల నేప‌థ్యంలో నాగ చైతన్య- సమంత విడాకులపై సీనియర్ హీరో, నాగ చైతన్య మామ విక్టరీ వెంకటేష్ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సెటైరికల్ పోస్ట్ చేశారు. ‘మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి’ అంటూ వెంకీ పెట్టిన పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పోస్ట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజా పరిస్థితులకు అనుగుణంగానే ఆయన ఈ పోస్ట్‌ పెట్టారా? అని అందరూ మాట్లాడుకుంటున్నారు. సామ్-చైలను ప్రశాంతంగా వదిలేయాలని అందరికీ వెంకీ మామ గట్టిగానే చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news