ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. నిత్యం ఏదో ఓ వార్తతో సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు వేణుస్వామి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఫ్యామిలీ గురించి ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ముఖ్యంగా “ప్రభాస్ కి, ఆయన పెద్దమ్మకి సంబంధం లేదు. చాలామంది బంధువులే అంటారు కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు నేను చెప్పదలుచుకోవడం లేదు. చాలామంది ఆయన పెద్దమ్మే కదా ఆమెకు తెలియకుండా ఉంటుందా? అంటారు కానీ నా వరకు నేను ప్రభాస్ తల్లి గారికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాను. ప్రభాస్ జాతకం వేరే వారి ద్వారా నా దగ్గరకు వచ్చింది, నేను జాతకం చూసి చెప్పాను కానీ అది ఎవరి ద్వారా వచ్చింది అనేది మాత్రం నేను చెప్పను. అయితే కృష్ణంరాజు గారి భార్య శ్యామల కూడా నా దగ్గరకు వచ్చారు. అయితే అది ప్రభాస్ విషయంలో కాదు. కృష్ణంరాజు గారు గవర్నర్ అవుతారా? లేదా? అనే విషయం తెలుసుకోవడానికి వచ్చారు. అయితే అసలు నేనేమీ ఆమెకు తెలియదు అన్నట్లుగా మాట్లాడడం కరెక్ట్ కాదు” అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చాడు.