FLASH : రాముడిగా ప్రభాస్.. అదిరిపోయే సర్ప్రైజ్..!

-

ఎట్టకేలకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు సంబంధించిన బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ చిత్రం చేస్తున్న ప్రభాస్.. దాని తర్వాత నాగ్ అశ్విన్ తో మరొక చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఇకపోతే నిన్న రాత్రి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో కలిసి ఓ వీడియో రిలీజ్ చేశాడు ప్రభాస్. మంగళవారం ఉదయం ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నట్టు ఆ వీడియో లో పేర్కొన్నాడు. అయితే చెప్పినట్టుగానే ఇవాళ ఉదయం ఆ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు.

ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో బిగ్ ప్రాజెక్టు కి ప్రభాస్ సిద్ధమైనట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఓం రౌత్ దర్శకత్వం వహించబోతున్న ఈ పౌరాణిక సినిమాకి ఆదిపురుష్ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. టీ సీరిస్‌ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అవ్వడంతో అది కాస్తా వైరల్ గా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news