సోషల్ మీడియాలో కానీ… సినీ అభిమానులు కానీ.. ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే రెండే రెండు విషయాల గురించి మాట్లాడుకుంటారు. ఒకటి ఆయన పెళ్లి, ఇంకోటి ఆయన సినిమాలు. ఆయన సినిమాల కంటే కూడా ఆయన పెళ్లి గురించే చాలామందికి చర్చ.
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారు.. అంటే ముందు వరుసలో ఉండే వ్యక్తి ప్రభాస్. అవును.. ప్రభాస్.. ఇప్పుడు కేవలం తెలుగు సినిమా హీరో మాత్రమే కాదు.. ఆయన జాతీయ స్థాయి నటుడు. భారతదేశంలో ఉన్న ఏ సినిమా ఇండస్ట్రీకైనా ప్రభాస్ సుపరిచితుడే. ఆయన హీరోగా నటించిన బాహుబలి సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నది.
సోషల్ మీడియాలో కానీ… సినీ అభిమానులు కానీ.. ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే రెండే రెండు విషయాల గురించి మాట్లాడుకుంటారు. ఒకటి ఆయన పెళ్లి, ఇంకోటి ఆయన సినిమాలు. ఆయన సినిమాల కంటే కూడా ఆయన పెళ్లి గురించే చాలామందికి చర్చ.
ప్రభాస్.. ఓకే అనాలే కానీ.. పెళ్లి చేసుకోవడానకి మేం రెడీ అంటూ అందమైన యువతులంతా క్యులో నిలుచుంటారు. ప్రభాస్ కు అంత క్రేజ్ ఉంది మరి.
ప్రభాస్ పెళ్లి టాపిక్.. బాహుబలి సినిమా షూటింగ్ సమయంలోనే తెరమీదికి వచ్చింది. కానీ.. బాహుబలి సిరీస్ కోసం కొన్ని సంవత్సరాల డేట్లనే రాజమౌళికి ప్రభాస్ ఇచ్చాడు. దీంతో బాహుబలి సిరీస్ పూర్తయ్యేదాకా పెళ్లి లేదు గిల్లి లేదు అంటూ ప్రభాస్ తన పెళ్లిని వాయిదా వేశాడు.
సరే… బాహుబలి సిరీస్ ల రిలీజ్ తర్వాత ఎలాగైనా ప్రభాస్ పెళ్లి ఉంటుందిలే అని అంతా అనుకున్నారు. కానీ.. బాహుబలి రెండు పార్ట్స్ రిలీజ్ అయిపోయాయి. మరో సినిమా సాహో షూటింగ్ లో ప్రస్తుతం ప్రభాస్ బిజీగా ఉన్నాడు కానీ.. పెళ్లి మాత్రం చేసుకోలేదు.
ఆ తర్వాత… ప్రభాస్.. తన కోస్టార్ అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఇద్దరూ ఖండించారు.
ప్రస్తుతం ఇంకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ ఇంట్లో కూడా పెళ్లి విషయమై తెగ ఒత్తిడి తెస్తున్నారట. ఒక అమ్మాయిని కూడా వెతికారట. అమెరికాలో స్థిరపడిన ఓ తెలుగు వ్యాపారికి కూతురితో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందట. సాహో మూవీ రిలీజ్ కాగానే వాళ్ల పెళ్లి ఉంటుందట.
అయితే… దీనిపై అటు ప్రభాస్ నుంచి కానీ.. ప్రభాస్ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. కనీసం ఇదైనా నిజమవుతుందా? లేక రూమర్ గానే మిగిలిపోతుందా? అంటే వేచి చూడాల్సిందే.