యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తున్నారు. యువీ క్రియేషన్స్‌తో కలిసి టీ సిరీస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. గత రెండు వారాలుగా ఇటలీలో `రాధే శ్యామ్` చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలోని తనకు సంబంధించిన కీలక ఘట్టాలని పూర్తి చేసిన పూజా హెగ్డే ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చేసింది.
`రాధే శ్యామ్` చిత్ర బృందం నిన్ననే షూటింగ్ పూర్తి చేసింది. ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ నవంబర్ 5 నుండి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కాబోతోంది. షూట్ కోసం ప్రత్యేక సెట్లు ఏర్పాటు చేశారు. బ్యాలెన్స్‌గా వున్న సీన్‌లన్నీఈ సెట్లలోనే పూర్తి చేయబోతున్నారు. మొత్తం షూట్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుంది.
ఐరోపా నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ సాగాలో పూజా హెగ్డే యువరాణిగా నటించింది. ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మోషన్ పోస్టర్ ఓ రేంజ్‌లో వుండటం.. సినిమా చాలా వరకు పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న సినిమా కావడంతో ప్రభాస్ కూడా ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారట. `సాహో` ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో ఈసారైనా `రాధేశ్యామ్`తో పాన్ ఇండియా హిట్ ని సొంతం చేసుకోవాలని ప్రభాస్ భావిస్తున్నాడట.