సినిమాలకు ప్రభాస్ బ్రేక్.. కారణం ఇదే..!

-

ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పనుండే హీరో ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. భారీ హిట్ ని అందుకున్నారు తర్వాత లైన్ అప్లో క్రేజీ ప్రాజెక్ట్స్ ని పెట్టారు. అయితే ప్రభాస్ కొన్ని రోజులు సినిమాలకి గ్యాప్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఆరోగ్యం పై ఫోకస్ పెట్టబోతున్నారని వార్తలు షికార్లు కొడుతున్నాయి. హీరో ప్రభాస్ ఇటీవలే కలిగే సినిమా షూటింగ్ పూర్తి చేశారు ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

తర్వాత మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేయబోతున్నారు ఈ మూవీ షూటింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట. ఇటీవల ప్రభాస్ కి మోకాలి సర్జరీ కూడా జరిగింది అందుకనే కొన్ని రోజులు షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకోవాలని ఆరోగ్యము మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నారు ప్రభాస్ అప్పటివరకు సినిమాలకు గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news