డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.ఈ మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ కొత్త సంవత్సరంలో చేయనున్న సినిమాలు, సలార్ 2 కి సంబంధించిన అప్డేట్ లను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లకు సలార్ వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకోవడంతో రెబల్ స్టార్ ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు.
సలార్ పార్ట్ 2 స్టోరీ సిద్ధమైందని, త్వరలోనే సినిమాని సెట్స్ పైకి తీసుకువెళతామని తెలిపారు. ఈ చిత్రంను అభిమానులు, ప్రేక్షకుల కోసం వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురానున్నామని చెప్పారు. సలార్ పార్ట్ 2 వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.2024లో పలు జానర్లలో మూవీస్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తానని ఆయన చెప్పుకొచ్చారు. నా పని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకులను అలరించడమే అని అన్నారు. తన తర్వాతి సినిమాలు ఫ్యూచరిస్టిక్ మూవీ ఒకటి కాగా మరొకటి హారర్ మూవీ అని ప్రభాస్ వెల్లడించారు.