మంచు విష్ణు కు ప్రభుదేవా హ్యాండ్ ఇచ్చినట్లే నా.!

-

టాలీవుడ్ లో మంచు కుటుంబం ది ఒక ప్రత్యేక మైన గుర్తింపు వుంది. ఒకప్పుడు ఈ ఫ్యామిలీ పై అందరూ గౌరవం తో వుండే వారు.రాను రాను వారి సెల్ఫ్ డబ్బా ఎక్కువ అయ్యింది అని , కొంత బిహేవియర్ ప్రాబ్లమ్స్ వల్ల మరియు సినిమాలలో కంటెంట్ సరిగా లేకపోవటం తో వారి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. గత దీపావళి కు వచ్చిన మంచు విష్ణు  చిత్రం   జిన్నా కూడా ప్లాప్ అయ్యింది.

అందాల ముద్దగుమ్మలు పాయల్ రాజ్ పుత్, సన్ని లియోన్లు వున్నా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.ఈ సినిమా కోసం  ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసినా, మరీ తీసి వేయదగ్గ సినిమా కాకపోయినా, రివ్యూ లు కూడా పరవాలేదు అన్నా కూడా ప్రేక్షకులు సినిమా ను చూడలేదు. కలెక్షన్స్ మరీ దారుణం అని సోషల్ మీడియాలో ట్రొలర్స్  కామెంట్స్  హల్చల్ చేశాయి.

ఇక  అప్పుడే సినిమా లో ఒక సాంగ్ కు డాన్స్ కంపోజ్ చేసిన ప్రభుదేవ తో సినిమా ఉందని అప్పట్లో న్యూస్ హల్చల్ చేసింది. ప్రభుదేవ చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చి విష్ణు తానే నిర్మాత గా మారి సినిమా తీస్తా అని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తీరా జిన్నా సినిమా ఫ్లాప్ కావడంతో ప్రభుదేవా కూడా తన ఆలోచన ను విరమించు కున్నాడని తెలుస్తోంది. ఇక మంచు విష్ణు తో సినిమా తీసే డైరెక్టర్ కోసం వెతుకుతూ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news