పశువుల పై కొన్ని సార్లు విషప్రయోగం లేదా విషపూరీత మొక్కలను తింటుంటాయి.. అలాంటి సమయాల్లో దగ్గరలోని పశువైద్యుని సంప్రదించి పరిస్థితిని వివరిస్తే విషప్రభావ తీవ్రతను తగ్గించి పశువును కాపాడుకోవచ్చు.. అన్ని విషాలకు మందులు ఉండక పోయిన కూడా అవి చేసే ప్రవర్తన ఆదారంగా మందులు లను ఇస్తారు.చూపించే లక్షణాల ఆధారంగా చికిత్స చేసి పశువులను సంరక్షించుకోవచ్చు. ఈ చికిత్స చేయడం అనేది త్వరితగతిన ప్రారంభించాలి. చికిత్సలో జాష్యం జరిగితే విష ప్రభావం మరింత ఎక్కువై, పశువు మరణించే ప్రమాదం ఉంది..
ఇక పశువుల విషాన్ని బయటకు తీసుకురావాడానికి ఒక లీటరు పారఫిన్ మైనం లేదా వంట నూనెను త్రాగించటం లేదా ప్రత్యక్షంగా పెద్ద పొట్టలోకి ఎక్కించటం. వంట బొగ్గును మెత్తగా పొడి చేసి పాలలో లేదా నీటిలో కలిపి 50 గ్రా./ ల పెద్ద పశువులకయితే 2 లీటర్లు, చిన్నవాటికి అయితే ఒక లీటరు చెప్పున తాగించాలి. 10 నుండి 12 గుడ్ల తెల్ల సొనను, పావు కేజీ పంచదారను లీటరు నీటిలో కలిపి రోజుకు ఒకసారి చొప్పున రెండు రోజులు త్రాగించాలి..అలాగే పరిశ్నుభమైన నీటిని అందిస్తూ, చల్లని నీడ మరియు స్వచమైన గాలి ప్రసరించే ప్రదేశాల్లో ఉంచి ఈగలు, దోమలు వాలకుండా వేప నూనె పూయాలి.
ఇంజక్షన్ కార్తికోస్టేరాయిడ్ లను ఇవ్వాలి. విష ప్రభావానికి లోనైన పశువు మూర్చవ్యాధికి గురై నేలమీద పడి తీవ్రంగా కొట్టుకుంటున్నప్పుడు నీటిగా ఉండేలా చూసుకోవాలి..లేత జొన్న ఆకులను మేసిన వశువులు సైనైడ్ ప్రభావానికి గురైనప్పుడు దీనికి విరుగుడుగా సోడియం నైటేట్, సోడియం థయాసల్ఫేట్ ద్రావణాలను వాడాలి మరియు పౌడర్ చార్మోల్‌నుత్రాగించాలి..
ఆకలి మందగించి తీవ్రంగా నీరసించిన పశువులకు గ్లూకోస్ ద్రావణాన్ని మరియు కాల్షియం ఇంజక్షన్‌ను రక్తంలోకి ఎక్కించాలి..పశువు తొందరగా కోలుకొనేందుకు వీలుగా వి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు, కాలేయ పనితీరును పెంచే ఔషధాలు, యాంటిబయోటెక్ ఇంజక్షన్లు వేయించాలి.. అన్నిటికన్నా ముఖ్యంగా వైద్యుల పరివేక్షణలో ఉంచాలి..